బతకాల్సిన బిడ్డను.. సెప్టిక్ ట్యాంక్ వద్ద వదిలేశారు
M Munirathnam
Srikalahasthi Reporter
◉
11 Views
గాయత్రి న్యూస్ ,శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. తల్లి తన పేగు బంధాన్ని తెంచుకోవాలనుకున్నదా, లేక తల్లి నుండి బిడ్డని ఎవరైనా వేరు చేశారా..? పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆగస్టు 17 సోమవారం ఉదయం సుమారు 6.30 గంటలకు ప్రభుత్వ మహిళా హాస్టల్ వెనుక సెప్టిక్ ట్యాంక్ వద్ద అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి II టౌన్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, హాస్టల్ వార్డెన్ సహాయంతో శిశువును ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా ఉన్నాడు. ఈ బిడ్డను ఎవరు, ఎందుకు అక్కడ వదిలివెళ్లారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.