ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
Shiva Kumar
Prakasam Reporter
◉
10 Views
గాయత్రి న్యూస్ ,మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు భద్రతా కాన్వాయ్ కోసం రాష్ట్ర హోంశాఖ ఆరు కొత్త ఫోర్స్ అర్బానియా 4400 WB వాహనాల కొనుగోలుకు అనుమతించింది. వీటి కోసం మొత్తం రూ.1.78 కోట్లు వెచ్చించనున్నారు. ఒక్కో వాహనం ధర సగటున రూ.29.67 లక్షలుగా ఉంది. పారదర్శకత కోసం జెమ్ పోర్టల్ ద్వారా కొనుగోలు చేయనున్నారు. ప్రస్తుతం కాన్వాయ్ వినియోగిస్తున్న టయోటా వాహనాల స్థానంలో కొత్త వాహనాలను ప్రవేశపెట్టనున్నారు.