యథావిధిగా పిజిఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్ ల నిర్వహణ
Prabhakar
Ealuru Incharge
◉
22 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: 17వ తేదీ సోమవారం యధావిధిగా పీజీఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్ ల నిర్వహణ జరుగుతుందని,1100 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి ఫిర్యాదు నమోదు, స్థితి తెలుసుకోవచ్చని,అధికారిక వెబ్సైట్ meekosam.ap.gov.in ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని, అర్జీ స్థితి తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశం మందిరంలో కలెక్టర్ మాట్లాడుతూ సోమవారం ఉదయం 10 గంటల నుంచి జిల్లా స్థాయిలో పిజిఆర్ఎస్,రెవిన్యూ క్లినిక్ ల నిర్వహణ జరుగుతుందని తెలిపారు.