ట్రాఫిక్ నియంత్రణలో ప్రతిభ.. వెంకటేష్‌కు ఎమ్మెల్యే, ఆర్డీవో ప్రశంసలు
M Munirathnam
Srikalahasthi Reporter
◉
23 Views
గాయత్రి న్యూస్ ,శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే నాలుగు మాడవీధుల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటేష్‌ను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి అభినందించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో వెంకటేష్‌కు ప్రశంసాపత్రం అందజేశారు. ఆలయ దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల వాహనాలతో పాటు స్థానికుల రాకపోకల కారణంగా పట్టణంలో తరచూ ట్రాఫిక్ రద్దీ నెలకొంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ విధులు నిర్వర్తించిన వెంకటేష్ సేవలను అధికారులు ప్రశంసించారు.