167 ఆర్జీలు పరిష్కరించాం: ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి
Prabhakar
Ealuru Incharge
◉
10 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు: గత నెలరోజులలో 22ఏ జాబితా నుండి తొలగింపునకు 434 అర్జీలు అండగా 167 అర్జీలు పరిష్కరించామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ కి చెప్పారు. 22ఏ భూ సమస్యల పరిష్కారం,రీసర్వే, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, రెవిన్యూ వన్, పిజిఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం, తదితర అంశాలపై రాష్ట్ర సచివాలయం నుండి మంగళవారం రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమీషనర్ జి. జయలక్ష్మి తో కలిసి సిఎస్ సాయిప్రసాద్ రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.