శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న హీరోయిన్
M Munirathnam
Srikalahasthi Reporter
◉
13 Views
గాయత్రి న్యూస్ ,శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని ‘జర్నీ’ సినిమా ఫేమ్ ప్రముఖ నటి అనన్య గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మరియు మాజీ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం పాలకమండలి సభ్యులు బుల్లెట్ జయశ్యం రాయల్ దంపతులు దక్షిణ గోపురం వద్ద ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దర్శనం చేయించారు. దర్శనం అనంతరం ఆలయ వేద పండితులు అనన్యకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దినేష్, సోహైల్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.