స్థానిక వార్తలు

ఏపీ మంత్రివర్గ కీలక నిర్ణయాలు - ముఖ్యాంశాలు

Reporter
Shiva Kumar Prakasam Reporter
1 month ago
◉ 18 Views
News Image

గాయత్రి న్యూస్ ,మంగళగిరి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో మొత్తం 12 కీలక అంశాలకు ఆమోదం లభించింది. తల్లికి వందనం (2026-27): మార్గదర్శకాలు, పరిపాలనా అనుమతులకు ఆమోదం. అదనంగా 58,060 మంది చేరికతో మొత్తం లబ్ధిదారులు 68,57,880 మంది. ఆశా కార్యకర్తల గ్రాట్యుటీ:విధి నిర్వహణలో మరణించిన వారికి ఏడాది సర్వీసుకు ₹5,000 చొప్పున గరిష్ఠంగా *₹1.50 లక్షల గ్రాట్యుటీ. రేపల్లె CHC అప్‌గ్రేడేషన్: 30 పడకల ఆసుపత్రి 100 పడకల ఏరియా ఆసుపత్రిగా మార్పు (₹58.42 కోట్లు, 66 కొత్త పోస్టులు). APHIMS ప్రాజెక్టు: ₹20.62 కోట్లతో హార్టికల్చర్ ఇన్ఫర్మేషన్ & మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఏర్పాటు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్:విశాఖ మరికవలసలో గిరిజన విద్యార్థులకు ఉచిత IIT-JEE, NEET రెసిడెన్షియల్ కోచింగ్ సెంటర్. డైట్ ఛార్జీల పెంపు: సంక్షేమ, రెసిడెన్షియల్ హాస్టల్ విద్యార్థుల డైట్ ఛార్జీల పెంపునకు ఆమోదం

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం