మార్కాపురం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
Shiva Kumar
Prakasam Reporter
◉
23 Views
గాయత్రి న్యూస్ ,మార్కాపురం: మార్కాపురం కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్.. సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.