స్థానిక వార్తలు

విశాఖలో అక్టోబర్‌ 2 నుంచి 8 వరకు ఇందిరాగాంధీ వన్యప్రాణి వారోత్సవాలు

Reporter
Shiva Kumar Prakasam Reporter
1 month ago
◉ 21 Views
News Image

గాయత్రి న్యూస్ ,విశాఖపట్నం: విశాఖలో అక్టోబర్‌ 2 నుంచి ఇందిరాగాంధీ వన్యప్రాణి వారోత్సవాలు జూలాజికల్‌ పార్క్‌ ఆధ్వర్యంలో అక్టోబర్‌ 2 నుంచి 8వ తేదీ వరకు వన్యప్రాణి వారోత్సవాలు నిర్వహించనున్నట్లు పార్క్‌ క్యూరేటర్‌ తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది వారోత్సవాల ప్రధాన నినాదంగా “ఆవాసాలను అనుసంధానించు వన్యప్రాణులను వృద్ధి చేయు” అనే సందేశాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, వన్యప్రాణుల దర్శనం, ప్రశ్నోత్తర పోటీలు నిర్వహించనున్నారు. ప్రజలకు వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు.వారోత్సవాల్లో పాల్గొనే వారు ఈ కాంటాక్ట్ నెంబర్ ని సంప్రదించండి 7893632900.

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం