బీసీల అన్యాయాన్ని ఇక సహించేది లేదు: మేనం సంతోష్ పటేల్ డిమాండ్
Puthala Naveen
Mandal Reporter
◉
15 Views
గాయత్రి న్యూస్ ,భూపాలపల్లి: బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఇకపై సహించేది లేదని, బీసీ సమాజమంతా ఒక్కటై మన హక్కులను మనమే దక్కించుకోవాలన్న సంకల్పంతో మన చరిత్రను మనమే తిరగరాయాలని టిఆర్పి మల్హార్, రావ్ మండల్ ఇంచార్జ్ మేనం సంతోష్ పటేల్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ఇస్తామన్న వాటా ఎక్కడ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీసీలకు 45 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పార్లమెంటులో బీసీ బిల్లును ఎందుకు ప్రవేశపెట్టలేదు, ఎందుకు అమలు చేయడం లేదని ఆయన నిలదీశారు.