రాజమండ్రిలో పోషణ్ అభియాన్ ఫోటో ఎగ్జిబిషన్
గాయత్రి న్యూస్ ,కాకినాడ: జాతీయ పోషణ్ మాసోత్సవాలు–2026లో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) కాకినాడ క్షేత్ర కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల పోషణ్ అభియాన్ ఫోటో ఎగ్జిబిషన్‌ను రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి గారు మంగళవారం ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కళాశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వికసిత భారత నిర్మాణంలో ఆరోగ్యవంతమైన సమాజం కీలకమని, మహిళలు, శిశువుల సమగ్ర పోషణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం, ఆరోగ్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితంపై రూపొందించిన ‘సేవా సంకల్ప అభియాన్’ ప్రచురణలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీబీసీ అధికారులు, ఐసీడీఎస్ అధికారులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు