అంగన్వాడీ భావన నిర్మాణం భూమి పూజ
POLASA SUMAN
Lokeshwaram Nirmal Reporter
◉
19 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: నిర్మల్ జిల్లా, లోకేశ్వరం మండలం, పిప్రి గ్రామం: పిప్రి గ్రామంలో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి గురువారం భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కండెల వనిత అశోక్, ఉపసర్పంచ్ రాజమణి సాయన్న, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత నర్సింగ్ రావు, పంచాయతీ కార్యదర్శి ప్రకాష్, అంగన్వాడీ టీచర్ దృపద శోభా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో అంగన్వాడీ భవనం నిర్మాణం జరగడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. చిన్నారులకు మెరుగైన వాతావరణం, విద్యా-పోషకాహార సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని వారు తెలిపారు.