స్థానిక వార్తలు

రథం బజార్‌లో వైభవంగా సిద్ధి బుద్ధి సమేత వినాయక కళ్యాణం

Reporter
Shiva Kumar Prakasam Reporter
2 months ago
◉ 30 Views
News Image

గాయత్రి న్యూస్ ,మార్కాపురం: భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు.. ఘనంగా అన్నదానం మార్కాపురం పట్టణంలోని రథం బజార్‌లో గణేష్ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ సిద్ధి బుద్ధి సమేత వినాయక కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన కళ్యాణ వేడుక భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం నిర్వాహకుల ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నామస్మరణతో రథం బజార్ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం