అగ్నిప్రమాద బాధితులకు సిపిఐ సహాయం
Prabhakar
Ealuru Incharge
◉
12 Views
గాయత్రి న్యూస్ ,సాలూరు: మండలంలోని చాగరపల్లి గ్రామంలో ఇటీవల అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయి నష్టపోయిన కుటుంబానికి సిపిఐ ఆధ్వర్యంలో మంగళవారం సహాయం అందించారు. ఆ గ్రామానికి చెందిన చిచ్చటి దేవయ్య కు సంబంధించిన పూరిల్లు ఈనెల 9న అగ్నికి ఆహుతయింది. దీంతో సుమారు రెండు లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించింది. విషయం తెలుసుకున్న సిపిఐ మండలకార్యదర్శి బాడిశ రాము ఆధ్వర్యంలో అక్కడికి చేరుకొని ప్రమాదకారణాలను అడిగి తెలుసుకుని వారికి కొంతనగదు అందించారు. ప్రభుత్వం వారిని అన్ని విధాల ఆదుకోవాలని అలాగే ఇల్లు మంజూరు చేయాలని కోరారు. దాతలు మరింత మంది ముందుకు వచ్చి నష్టపోయిన ఆకుటుంబానికి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.