కుబీర్ మండల కేంద్రంలో వనమహోత్సవం
Menchu Bhojanna
Adilabad Incharge
◉
9 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కుబీర్ మండల కేంద్రంలో అధికారులు వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా స్థానిక శ్మశాన వాటిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలలో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో భీమేష్, సర్పంచ్ సాయినాథ్, ఆత్మ చైర్మన్ వివేకానంద తదితరులున్నారు.