తిరుమల లో పవిత్రోత్సవాలు
Shiva Kumar
Prakasam Reporter
◉
31 Views
గాయత్రి న్యూస్ ,తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆదివారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపు చేసి హోమాలు, వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సంపంగి ప్రాకారంలో స్నపన తిరుమంజనం చేపట్టారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. వేద పండితులు పంచసూక్తాలను పఠించారు. సాయంత్రం స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.