విశాఖపట్నం మెరుస్తోంది
Shiva Kumar
Prakasam Reporter
◉
17 Views
గాయత్రి న్యూస్ ,విశాఖపట్నం: విశాఖపట్నం, ఆగస్టు 21 | ప్రతినిధి: రామడుగు శివకుమార్ బ్రిక్స్ ఇండియా సదస్సు–2026కు విశాఖపట్నం వేదికగా నిలుస్తోంది. పర్యాటకం, చరిత్ర, ప్రకృతి అందాల సమ్మేళనమైన విశాఖ ప్రపంచ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పురాతన బౌద్ధ క్షేత్రం తొట్లకొండ చారిత్రక ప్రాధాన్యతతో పాటు ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. అంతర్జాతీయ అతిథులకు విశాఖ అందాలు, ఏపీ సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేసే అవకాశం లభిస్తోంది. బ్రిక్స్ సదస్సుతో విశాఖకు అంతర్జాతీయ గుర్తింపు మరింత పెరగనుంది.