తానూర్: పెన్షన్ లేక ఇబ్బందుల్లో బాలిక
Menchu Bhojanna
Adilabad Incharge
◉
14 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: తానూర్ మండలం ఝరి (బి) గ్రామానికి చెందిన సీడ్లోద్ సావిత్రబాయి కుమార్తె వైష్ణవి పుట్టుకతోనే అంగవైకల్యు రాలు. ఇప్పటి వరకు ఆమెకు దివ్యాంగుల పెన్షన్ అందడం లేదని సావిత్రిబాయి ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త సైతం చనిపోయాడని.. దీంతో తన కూతురి భారం ఇబ్బందిగా ఉందన్నారు. ఆధార్ సెంటర్కు వెళితే వేలిముద్రలు, కళ్లు పడటం లేదని చెబుతున్నారని.. అధికారులు స్పందించి తన కుమార్తెకు పెన్షన్ అందజేయాలని కోరారు గ్రామ సర్పంచి గారు మరియు ఎంపీడీవో గారి దృష్టికి తీసుకువెళ్లి వారి కుటుంబానికి కుటుంబాన్ని ఆదుకుంటారని గ్రామ ప్రథమ పౌరుడు అయినటువంటి సర్పంచి గారు దీనిని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి వారి కుటుంబానికి అండగా అవుతారని కోరుతున్నాము