కేరళం చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Prabhakar
Ealuru Incharge
◉
21 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఇటీవల ముంబయిలో శస్త్రచికిత్స చేయించుకున్న కుడి భుజానికి తదుపరి చికిత్స నిమిత్తం శనివారం సాయంత్రం కేరళ రాష్ట్రానికి చేరుకున్నారు. త్రిస్సూర్ సమీపంలోని ఓ ఆయుర్వేద వైద్యశాలలో ప్రత్యేక థెరపీ ద్వారా ఆయన చికిత్స చేయించుకోనున్నారు. శనివారం సాయంత్రం కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి నేరుగా చికిత్స అందించనున్న కేరళ ఆయుర్వేద వైద్యశాలకు బయలుదేరి వెళ్లారు.