గిరిజనుల భూములపై గిరిజనేతరులకు పరిహారమా
Prabhakar
Ealuru Incharge
◉
24 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: కుక్కునూరు మండలం,అర్వాయిపల్లి రెవిన్యూ పరిధిలోని 216 ఎకరాల నోటిఫికేషన్ పై నెమలిపేట గిరిజన రైతులు గురువారం తహశీల్దార్ కార్యాలయాన్ని సుమారు 200 మంది గిరిజన రైతులు చుట్టూ ముట్టారు.పోలవరం జిల్లా కూనవరంమండలం పెద్దఆర్కుర్ గ్రామగిరిజన రైతులకు భూమికిభూమి కిందఇస్తున్న అరవాయిపల్లి భూముల నోటిఫికేషన్ లో గిరిజనులభూములపై గిరిజనేతరుల పేర్లు ప్రకటించారని నిరసన వ్యక్తం చేశారు.తరతరాలుగా భూమిని నమ్ముకొని సాగు చేస్తున్న మాభూములపై కొంతమంది పెత్తందారులు అడ్డదారిలో పట్టాలు చేయించుకుని అమాయకులైన గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని,వారికి కొంత మంది అధికారులు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు.తహశీల్ధార్ చలపతిరావుకు వినతిపత్రం అందించారు.