ఫర్టిలైజర్ షాపుల దోపిడీ...
Puthala Naveen
Mandal Reporter
◉
14 Views
గాయత్రి న్యూస్ ,భూపాలపల్లి: మహాదేవపూర్ మండలంలోని పలుగ్రామాల్లో ఎరువుల ధరలు రైతులకు భారంగా మారుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫెర్టిలైజర్స్ దుకానాలల్లో యూరియా ఎమ్మార్పి 267 రూపాయలకు గాను 320-350కు డి.ఎ.పీ 1350కి గాను1850 రూపాయలకు అమ్ముతున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆప్ ద్వారా బుక్ చేసుకుని కొనుగోలు చేసినా నిర్ణయించిన ధరలకన్నా అధికంగా విక్రయిస్తున్నారని మండి పడుతున్నారు.ఇవే కాకుండా స్ప్రే మందులు కూడా ఒక్కొక్క షాప్ లో ఒక్కో రేటు తో అమ్ముతున్నారు, వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం వల్లనే దళారులు దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.