మద్దులపల్లిలో బతుకమ్మ సంబరాలు
Puthala Naveen
Mandal Reporter
◉
13 Views
గాయత్రి న్యూస్ ,భూపాలపల్లి: మహిళలు తంగేడు, గునుగు, చామంతి వంటి రకరకాల సహజసిద్ధమైన పూలతో బతుకమ్మలను గోపురాకృతిలో అందంగా పేర్చారు. బతుకమ్మల చుట్టూ చేరున మహిళలు, యువతులు సాంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ ఎంతో ఉత్సాహంగా నృత్యాలు చేశారు. సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన చిన్నారులు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా గౌరమ్మకు వివిధ రకాల సద్దులను (నైవేద్యాలను) సమర్పించి, ముత్తైదువులు ఒకరికొకరు వాయనాలు ఇచ్చుకున్నారు.