ఏఎన్ఎంపై చర్యలు తీసుకోండి
M Munirathnam
Srikalahasthi Reporter
◉
11 Views
గాయత్రి న్యూస్ ,శ్రీకాళహస్తి: విధుల్లో నిర్లక్ష్యంతో పాటు ఆశా వర్కర్లను కక్షపూరితంగా వేధిస్తున్న కాసరం సచివాలయం ఏఎన్ఎం దేవిపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పెనగడం గురవయ్య డిమాండ్ చేశారు. బాధిత ఆశాలు, గ్రామస్తులతో కలిసి బుధవారం కాసరం పీహెచ్సీ వద్ద నిరసన చేపట్టారు. ఆశాలు పద్మ, చెంచులక్ష్మి, చెన్నమ్మలకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ, చేయకుంటే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆరోపించారు. ఏఎన్ఎంకు ఇప్పటికే ఎనిమిది షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయని తెలిపారు. అనంతరం వైద్యాధికారి మాధవ్‌కు వినతిపత్రం అందజేశారు. ఏఎన్ఎంకు షోకాజ్ నోటీసు ఇచ్చామని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నామని ఆయన తెలిపారు.