ముమ్మరంగా టిడిపి ఇంటింటి ప్రచారం
Prabhakar
Ealuru Incharge
◉
8 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా కుక్కునూరు లో చేపట్టిన ఇంటింటికి కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకు రహదారి సౌకర్యం లేని గ్రామాల్లో సైతం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఊపందుకుందో. టిడిపి కుక్కునూరు మండల అధ్యక్షులు ములిశెట్టి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం పలు గ్రామాల్లో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండేళ్లలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు తీరు అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ప్రభుత్వ విజయాలు సంక్షేమం పై రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేస్తూ అక్కడక్కడ గ్రామాల, ప్రజల సమస్యలను గురించి అడిగి ఆయన అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నాగేశ్వరావు హామీ ఇచ్చారు.