వికసిత్ భారత్ లక్ష్యసాధనకు భాగస్వాములు కండి
Prabhakar
Ealuru Incharge
◉
11 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో "2047 వికసిత్ భారత్ లక్ష్యసాధనకు ప్రతి ఒక్కరి ఆలోచనలు,సూచనలు అందజేసి భాగస్వాములు కావాలి" అనే అంశం పై జిల్లా,మండల పలుశాఖల అధికారులతో జిల్లా జాయింటు కలెక్టర్ యం.జె.అభిషేక్ గౌడ గూగుల్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింటు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నేను అనే కార్యక్రమం ద్వారా తమ ఆలోచనలు,సూచనలు సంక్షిప్తంగా కొద్ది సెకన్ల వీడియో రూపంలో తెలియజేసి,నిర్దేశించిన విధంగా అప్లోడ్ చెయ్యాలన్నారు.భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పాటు,వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రజలు, విద్యార్థులు సూచనలు చేయాలన్నారు.