AIIB పథకంతో తాగునీటిసమస్యకు పరిష్కారం
Prabhakar
Ealuru Incharge
◉
11 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం పట్టణానికి AIIB పథకం ద్వారా ప్రతి ఇంటికి శుద్ధి చేసిన త్రాగునీటి కుళాయిని ఇస్తామని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పేర్కొన్నారు.జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోAIIB పథకం అమలుపై మంగళవారం రెండవ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈసందర్భంగా ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడుతూ ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేసి త్వరితగతిన ప్రజలకు తాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ పై ఉందని,పనుల వేగం పెంచేలా చూడాలని అధికారులను ఆదేశించారు.