భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
Prabhakar
Ealuru Incharge
◉
17 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని జనసేన పార్టీ వేలేరుపాడు మండల అధ్యక్షులు గణేశుల ఆదినారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.విద్యుత్ స్థంబాలు,తీగలను తడి చేతులతో ముట్టుకోవద్దని,అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని,వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నందున ఎవ్వరు దాటొద్దని, చేపల వేటకు వెళ్ళవద్దని ఆదినారాయణ కోరారు.