ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ చేసిన జనసేన నాయకులు
గాయత్రి న్యూస్ ,శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పట్టణంలో జనసేన పార్టీకి చెందిన పేట బ్రదర్స్ (పేట చంద్రశేఖర్ మరియు పేట చిరంజీవి) ఆధ్వర్యంలో RTC బస్టాండ్ ఆవరణలో మట్టి వినాయకుల ప్రతిమలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఈ కార్యక్రమం చేశామన్నారు. అదేవిదంగా రసాయనాలతో తయారుచేసిన వినాయకులను పూజ తర్వాత నిమజ్జనం చేసేటప్పుడు గాలి కాలుష్యంతో పాటు భూమి కాలుష్యం, నీటి కాలుష్యం అవడం వలన జలచరజీవులు నశించిపోతున్నాయి కాబట్టి మనందరం కూడా బాధ్యతతో మట్టితో తయారుచేసిన వినాయకులను పూజించడం లక్ష్యంగా పెట్టుకోవాలని అదేవిధంగా ప్రతి కుటుంబం కూడా సుఖ సంతోషాలతో అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని జనసేన పార్టీ తరపున వినాయక స్వామిని కోరుకుంటున్నామన్నారు.