ప్రతి ఒక్కరూ "గీతా పారాయణం"చేయాలి
Prabhakar
Ealuru Incharge
◉
73 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: కులం,మతం,ప్రాంతం అనే తేడాల్లేకుండా జగద్గురువు శ్రీ కృష్ణుడు చెప్పిన "భగవద్గీత"ను అందరూ పారాయణం చేయాలని బిజెపి ధార్మిక శాఖ జిల్లా కో కన్వీనర్ వాడపల్లి లక్ష్మాణాచార్యులు సూచించారు.శుక్రవారం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా భక్తులకు ఆయన గీతా పారాయణం చదివి వినిపించారు .ఈ సందర్భంగా లక్ష్మణా చార్యులు మాట్లాడుతూ..కలియుగంలో మానవులు పాటించాల్సిన "ధర్మం"గురించి కలియుగారంభంలోనే శ్రీకృష్ణుడు "గీత"ద్వారా మనకు జ్ఞానోదయం చేశారని తెలిపారు.ధర్మో రక్షతి రక్షితః అని సూచించారు.