వైఎస్సార్ విగ్రహం సాక్షిగా కూటమి నాయకులకు కామినేని వార్నింగ్
Prabhakar
Ealuru Incharge
◉
22 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: వైఎస్సార్ వర్ధంతి సందర్బంగా వైసీపీ సీనియర్ నాయకులు కామినేని వెంకటేశ్వరరావు స్పందించారు.మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గురించి మాట్లాడే నైతికహక్కు ఎవరికీలేదని,నీతినిజాయితీకి నిలువెత్తు నిదర్శనమని,ఆయన ప్రజలు, రైతుల కోసం నిబద్ధతతో పనిచేసిన నాయకుడన్నారు.వేలేరుపాడు కూటమి నాయకులలాగా అమాయకులైన రైతులను మభ్యపెట్టి సెటిల్మెంట్లు చేసుకునే వ్యక్తి కాదని ఘాటుగా స్పందించారు.2029లో వైసీపీ వస్తుందని,ఇప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలు,అవినీతిపరులైన వారికి వత్తాసు పలుకుతున్న అధికారులెవరైనా సరే,చట్టపరంగా శిక్ష పడేలా చేస్తాం” అని కామినేని హెచ్చరించారు.