మాజీ ఎమ్మెల్యేను విమర్శించే స్థాయి మీకు లేదు
Prabhakar
Ealuru Incharge
◉
33 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: కుకునూరు మండలంలోని అర్యాయిపల్లి గ్రామ గిరిజనుల అంగీకారం లేకుండా భూసేకరణ ఎలా చేస్తారని,అందుకు విరుద్ధంగా నోటిఫికేషన్ ఇచ్చిన అధికారులపై ప్రోత్సహించిన అధికారపార్టీ నాయకులపై విచారణ జరపాలని వైసీపీ మండల అధ్యక్షులు తాండ్ర రాజేష్,మాజీ కన్వీనర్ కుచ్చర్లపాటి నరసింహరాజు,ఉపాధ్యక్షులు రాయి సత్యనారాయణ,నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ మల్లెల చంటి నాయుడు డిమాండ్ చేశారు.పత్రికలు,చానళ్లలో గిరిజనరైతుల ఆవేదనను విని,మాట్లాడిన పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజును విమర్శించే స్థాయి మీకు లేదని కుక్కునూరు,వేలేరుపాడు మండలఅధ్యక్షులకు హితవు చెప్పారు.