సుంక్లి గ్రామంలో సాహిత్య సామ్రాట్ శ్రీ అన్న బాహు సాఠే జయం
గాయత్రి న్యూస్ ,భైంసా: సుంక్లి గ్రామ అభివృద్ధికి ప్రత్యేక కృషి ఎమ్మెల్యే శ్రీ రామారావు పటేల్ గారు భైంసా మండలం సుంక్లి గ్రామంలో సాహిత్య సామ్రాట్ శ్రీ అన్న బాహు సాఠే జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన అన్న బాహు సాఠే విగ్రహాన్ని *ముధోల్ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ గారు* ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నభౌ సాఠే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన రచనలు, కవితల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారని కొనియాడారు.అన్న బాహు సాఠే రచనలు సామాజిక అసమానతలపై పోరాటానికి స్ఫూర్తినిచ్చాయని, అణగారిన వర్గాల హక్కుల సాధనకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమాజంలోని పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలిపారు.సుంక్లి గ్రామ అభివృద్ధికి ఇప్పటికే సుమారు రూ.80 లక్షల వరకు న