బ్యాంక్ నగదు పక్కదారి.. ఐకేపీ తీరిది
గాయత్రి న్యూస్ ,భైంసా: ఇందిరా క్రాంతి పథకంలో పని చేసే సిబ్బంది మహిళలకు పొదుపు, అప్పులు, బకాయిల లెక్కలు నెలవారీ సమావేశంలో సభ్యులకు వివ రించాల్సి ఉంటుంది. జమ చేసిన పొదుపు, రుణాల లెక్కలు సభ్యులందరికీ వివరించి డబ్బు లను బ్యాంకు ఖాతాలో జమ చేసే బాధ్యతను సభ్యులకు అప్పజెప్పి తీర్మానం రాసి సంతకాలు తీసుకోవాల్సిన బాధ్యత వారిది. కుభీరులోని ప్రగతి స్వయం సహాయక సంఘం బాధ్యతలను నిర్వర్తించే ఓ వీవోఏ 16 నెలలుగా డబ్బులు సొంతానికి వాడుకొని తర్వాత ఆ సంఘం ఖాతాలో నగదు జమ చేసిన ఘటన వెలుగుచూసింది. సంఘం సభ్యులు 12మంది 2024లో కుభీరులోని యూబీ ఐలో రూ. 20లక్షల రుణం తీసుకున్నారు. ప్రతి నెలా తీసుకున్న రుణ వాయిదా కింద రూ.80 వేలు బ్యాంకులో జమ చేస్తూ వస్తున్నారు. ఆగస్టు 7వ తేదీతో బ్యాంకు రుణం తీరిపోవాలి. కానీ ఆ వీవోఏ సభ్యులకు అదనంగా ఒక్కొ సంఘ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో డబ్బుల విషయమై అడుగుతున్న సీసీ భూమ