కుబీర్: పంచాయతీలకు 'పక్కా' గూడు ఎప్పుడు
Menchu Bhojanna
Adilabad Incharge
◉
15 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: కుబీర్: పంచాయతీలకు 'పక్కా' గూడు ఎప్పుడు? కుబీర్ మండలంలో నూతనంగా ఏర్పాటైన 22 గ్రామపంచాయతీలకు సొంత భవనాలు లేక పాలనకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రజల సమస్యలు వినాల్సిన కార్యాలయాలకే సొంత గూడు లేకపోవడంతో సర్పంచులు, సిబ్బంది అవస్థలు పడుతున్నారు. వీబీజీ రామ్జీ పథకంలో భవనాలు మంజూరైనా పనులు మొదలుకాకపోగా, కొన్ని చోట్ల ప్రారంభమైన పనులు మధ్యలోనే ఆగిపోయాయి. సమావేశాలు, అధికారిక కార్యక్రమాలకు స్థలం లేక ప్రజలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.