ఆగస్టు 31లోగా దరఖాస్తులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
Puthala Naveen
Mandal Reporter
◉
15 Views
గాయత్రి న్యూస్ ,భూపాలపల్లి: మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో కలెక్టర్ చాంబర్ నందు చేయూత సామాజిక భద్రత పింఛన్లు మంజూరుకు దరఖాస్తులు చేయు అంశంపై డీఆర్డీఓతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత సామాజిక భద్రత పింఛన్ల పథకంలో భాగంగా అర్హులైన కొత్త లబ్ధిదారులకు పింఛన్లు మంజూరుకు దరఖాస్తు లు స్వీకరించాలని తెలిపారు.ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, కల్లు గీత కార్మికులు చేనేత కార్మికులు, బోదకాలు, తలసేమియా, సికిల్ సెల్ డిసీజ్, హిమోఫిలియా వంటి రక్త రుగ్మతలతో బాధపడుతున్న వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.